Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 10:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 10:6
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.


వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి.


“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను బట్టి మీరు సిగ్గుపడతారు. మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు.


కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.


విగ్రహాలు చేసే వారు సిగ్గుపడతారు. వారంతా అవమానం పాలవుతారు. వారిలో ప్రతి ఒక్కడూ కలవరానికి గురవుతాడు.


“ఇశ్రాయేలు ప్రజలు తాము నమ్ముకున్న బేతేలు విషయంలో సిగ్గు పడినట్టే మోయాబు వాళ్ళు కెమోషు విషయంలో సిగ్గు పడతారు.


అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.


నీకు తృప్తి లేక, అష్షూరువాళ్ళతో కూడా నువ్వు ఒక వేశ్యలా ప్రవర్తించావు. వేశ్యలా ప్రవర్తించినా, నీకు తృప్తి కలగలేదు.


అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.


అతడు వారి దేవుళ్ళను పోతపోసిన బొమ్మలను విలువగల వారి వెండి బంగారు వస్తువులను చెరపట్టి ఐగుప్తుకు తీసుకుపోతాడు. అతడు కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపురాజు జోలికి పోడు.


సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది. తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు.


యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు. కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.


తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. నీ పుండు నయం చేయలేకపోయాడు.


ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.


ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ