Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 10:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది. ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నీ జనులమీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లలమీద తల్లులు నేలను పడవేయబడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు, మీ కోటలన్నీ నాశనమవుతాయి, ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు, మీ కోటలన్నీ నాశనమవుతాయి, ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 10:14
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.


వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.


అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.


వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా?


ఎఫ్రాయిములో భద్రత కోసం కట్టిన ప్రాకారాలూ, దమస్కులో రాజ్యాధికారమూ మాయమవుతాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రాభవానికి జరిగినట్టే సిరియాలో మిగిలి ఉన్న వారికీ జరుగుతుంది.” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.


సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?


అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.”


కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు. ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి.


ఇలా మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలూ, నీకు నాశనం ప్రాప్తిస్తుంది. ప్రాతఃకాలాన ఇశ్రాయేలు రాజును పూర్తిగా నిర్మూలం చేస్తారు.


షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.


“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.


సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?


ఆయన సేనల అధిపతి యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. దానిలో జీవించే వారంతా రోదిస్తారు. నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.


నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను.


అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు.


అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి.


రాజులను అపహాస్యం చేస్తారు. అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు. మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ