Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 10:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగ గాసింది. ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ, వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష . చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 10:1
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు.


యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.


ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”


నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా.


గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి.


“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.


ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.


ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.


తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.


దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.


దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.


ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు.


యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు. కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.


ఎఫ్రాయిము పాపపరిహారం కోసం ఎన్నెన్నో బలిపీఠాలను కట్టింది. కానీ అతడు పాపం చేయడానికి అవే దోహదం చేశాయి.


వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.


“మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.


దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.


ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.


మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ