Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 8:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లం అనే వారిని, ఉపదేశకులైన యోయారీబు ఎల్నాతాను అనే వారిని పిలిపించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో) ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా పిలిచాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 8:16
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు.


ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు.


తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.


యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక.


హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.


షిలెమ్యా, నాతాను, అదాయా.


అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు.


నేను వీరందరినీ అహవా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడూ నాకు కనబడలేదు.


కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దో అనే అధికారి దగ్గరికి వారిని పంపించాను. మా దేవుని మందిరంలో సేవ చేసేందుకు పరిచారకులను మా దగ్గరికి తీసుకు వచ్చేలా కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దోతో, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను.


మన దేవుని కరుణా హస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ షేరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడైన మహలి కొడుకుల్లో ఒకడు.


యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.


మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.


దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.


ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే,


నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.


దేవుని కుమారుడు వచ్చి మనకు అవగాహన ఇచ్చాడు. నిజమైన దేవుడెవరో అర్థం అయ్యేలా చేశాడు. మనం ఆ నిజ దేవునిలో, ఆయన కుమారుడు యేసు క్రీస్తులో ఉన్నాం. ఈయనే నిజమైన దేవుడూ శాశ్వత జీవం కూడా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ