Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 7:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 మీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు నియమించిన చట్టాలను గైకొనని వారిపై త్వరగా విచారణ జరిపి, వారికి మరణశిక్షగానీ, దేశ బహిష్కరణగానీ, వారి ఆస్తులను జప్తు చేయడం గానీ, చెరసాల గానీ విధించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 మీ దేవుని ధర్మశాస్త్రాన్నిగాని, రాజ శాసనాన్నిగాని ఎవరైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 7:26
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.


ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.”


ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.


ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే అతని ఇంటి దూలాల్లో ఒకదాన్ని ఊడదీసి దాన్ని నిలబెట్టి దానిపై అతణ్ణి ఉరితీయాలి. అతడు చేసిన ఆ తప్పును బట్టి అతడి ఇంటిని చెత్తకుప్పగా చెయ్యాలి.


ఏ రాజులైనా, ప్రజలైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, తన సన్నిధిని అక్కడ ఉంచిన దేవుడు వారు నశించిపోయేలా చేస్తాడు. మందిర నిర్మాణ పని వేగంగా జరగాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను” అని రాయించి ఆజ్ఞ జారీ చేశాడు.


కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.


నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.


“ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ