Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 6:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఆకాశంలో నివసించే దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, గొర్రెలు, పొట్టేళ్ళు, గోదుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని యాజకులకు ఇవ్వాలి. యెరూషలేములో ఉంటున్న వారు ఆకాశంలో ఉండే దేవునికి సువాసన గల అర్పణలు అర్పించి రాజు, అతని సంతానం బతికి ఉండేలా ప్రార్థన చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 6:9
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.


కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి.


దేవుని మందిరం పని కొనసాగేలా యూదుల పెద్దలకు మీరు చేయాల్సిన సహాయాన్ని గూర్చి మేము ఇలా నిర్ణయించాం. రాజు ధనాగారంలో నుండి, అంటే నది అవతల పన్నుగా వసూలైన సొమ్ములోనుండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి పని కోసం కావలసిన మొత్తాన్ని ఇవ్వాలి.


రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”


గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.


అహరోనుతో ఇలా అన్నాడు. “పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడనీ, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలునూ యెహోవా సమక్షంలోకి తీసుకు రా.


ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ