Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 5:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితిమి, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 దర్యావేషు రాజుకి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 5:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.


“రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక.


‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం.


కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి.


మందిరం మూడు వరసలున్న పెద్ద పెద్ద రాళ్లతో, ఒక వరస సరికొత్త మానులతో కట్టాలి. దానికయ్యే ఖర్చంతా రాజు ధనాగారం నుండి ఇవ్వాలి.


ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి?


ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాలవారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు.


బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకు పోగా తిరిగి యెరూషలేం, యూదా దేశంలోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనే వాళ్ళతోపాటు


ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి.


ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.


యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.


రాజు దానియేలుతో “ఈ రహస్య విషయాలు వెల్లడిపరిచే సమర్థత మీ దేవుడు నీకిచ్చాడు. నీ దేవుడు సమస్త దేవుళ్ళకు దేవుడు, రాజులందరికీ ప్రభువు, గూఢమైన విషయాలు వెల్లడి చేసేవాడు” అన్నాడు.


తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు.


సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది.


నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.


ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.


మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ