Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 10:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచ ననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఇప్పుడిక్కడ మనం మన దేవుని ముందు ఆ స్త్రీలను, వాళ్ల పిల్లలను అందర్నీ బయటికి పంపేస్తామని ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకుగాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 10:3
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.


ఇప్పుడు మనమీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చేయాలని ఉద్దేశించాను.


యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.


“మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”


‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.


కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”


వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు.


యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.


గతంలో చెర నుండి తిరిగి వచ్చినవారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు, దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండి పోయాను.


ముద్రలు వేసినవారు ఎవరంటే, హకల్యా కొడుకు, అధికారి అయిన నెహెమ్యా. ముద్రలు వేసిన యాజకులు సిద్కీయా,


యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు.


ఇందువల్ల మేమంతా అంగీకరించి నిర్ణయించుకొన్న దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొన్నాం. ముద్రలు వేసిన నిబంధన పత్రాలపై మా ప్రధానుల, లేవీయుల, యాజకుల పేర్లు ఉన్నాయి.


నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్‌


నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.


వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.


ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.


యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు.”


మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా


వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ