Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 10:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను –మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 అప్పుడు ఎజ్రా యాజకుడు ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 10:10
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.”


కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”


యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.


అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు, తప్పించుకొనే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా.


“నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.


ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.


ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ