Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 27:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 –సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – తూరు పట్టణమా–నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము: “‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు. అనేక దేశాలకు నీవు వ్యాపారివి. తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు. నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు. నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 27:3
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.


గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు,


వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.


యెహోవా తన చేతిని సముద్రంపై చాపాడు. ఆయన రాజ్యాలను కంపింపజేశాడు. కనానులో కోటలను నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు.


“కాని నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకుని, నీకు కీర్తి వచ్చినందుకు, ఒక వేశ్యలా దారిలో వెళ్ళే ప్రతివాడితో పొకిరీ పనులు జరిగిస్తూ వచ్చావు. నువ్వు ఆ మగాళ్ళ సొత్తుగా అయ్యావు.


ఈ విధంగా వాళ్ళు నీ ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. నీ వ్యాపార సరుకులను కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు. నీ విలాస భవనాలను పాడు చేస్తారు. నీ రాళ్లనూ నీ కలపనూ మట్టినీ నీళ్లలో ముంచివేస్తారు.


వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం.


నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.


ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ