Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 10:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 10:3
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.


సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.


తూర్పు వైపు తిరిగి ఉన్న గుమ్మం లోనుండి యెహోవా మహిమ తేజస్సు మందిరంలోకి ప్రవేశించింది.


ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “తూర్పు వైపు తిరిగి ఉన్న లోపటి ఆవరణద్వారం ఆరు పని దినాలు మూసి ఉంచి, విశ్రాంతి రోజున, అమావాస్య రోజున తెరవాలి.


ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.


ఆయన నావైపు చెయ్యి వంటిదాన్ని చాపాడు. నా తలపై జుట్టును ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నన్ను లేపి భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తాడు. అప్పుడు నాకు కలిగిన దేవుని దర్శనంలో ఆయన యెరూషలేముకు ఉత్తరాన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర తీవ్రమైన రోషాన్ని కలిగించే విగ్రహం ఉన్న చోటికి నన్ను తెచ్చాడు.


ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ