Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 22:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 సూర్యుడు ఉదయించిన తరువాత దొంగతనానికి వచ్చిన వాణ్ణి కొట్టిన వ్యక్తి పై హత్యానేరం ఉంటుంది. దొంగిలించిన సొత్తు తిరిగి చెల్లించాలి. దొంగ దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాణ్ణి బానిసగా అమ్మివేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును;వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయినయెడలవాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు. “ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు. “ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 22:3
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు.


మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,


ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది.


ఎవరైనా దొంగతనం చేస్తూ దొరికిపోతే వాణ్ణి చనిపోయేలా కొట్టినప్పుడు కొట్టిన వాళ్ళ మీద నేరం ఉండదు.


“ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి.” యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం ముగిసింది. ఆమెకు పాపాల వలన కలిగిన దోషం తీరిపోయింది. ఆమెకు చెప్పండి, యెహోవా చేతిలో ఆమె తన సమస్త పాపాల నిమిత్తం రెండింతల ఫలితం పొందిందని.


యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఏదీ? నా అప్పులవాళ్ళలో మిమ్మల్ని ఎవరికి అమ్మివేశాను? కేవలం మీ దోషాలను బట్టే మీరు అమ్ముడుపోయారు. మీ తిరుగుబాటును బట్టే మీ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది.


ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.


యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక,


కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ