Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 11:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అప్పుడు నీ సేవకు లైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి–నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 11:8
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి “నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక” అని చెప్పి పంపాడు.


కాబట్టి ఇశ్రాయేలు, యూదా, ఎదోము దేశాల రాజులు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికీ, గుర్రాలకూ మిగిలిన పశువులకూ నీళ్ళు లేకుండా పోయాయి.


ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది.


యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.


అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.


రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”


నిన్ను బాధించేవారు తమ సొంత మాంసం తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు తమ సొంత రక్తంతో వాళ్ళు మత్తులవుతారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడిననీ నీ విమోచకుడిననీ మనుషులంతా తెలుసుకుంటారు.”


దేవుని ఆత్మ నన్ను పైకి లేపి తీసుకు వెళ్ళాడు. యెహోవా హస్తం నన్ను తీవ్రంగా బలవంతం చేయడంతో నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనై బయలుదేరాను!


వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.


మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు.


వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.


వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.


వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.


విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు.


సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను.


బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు.


అతడు సుక్కోతు వాళ్ళతో “నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి” అని అడిగాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ