Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎస్తేరు 9:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 షూషనులో ఉన్న యూదులు ఆ నెలలో పదమూడవ, పద్నాలుగవ తేదీల్లో గుంపు గూడారు. పదిహేనో తేదీన వారు విశ్రాంతిగా ఉండి, విందు చేసుకుని సంతోషించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 అయితే షూషనులో ఉన్న యూదులు పదమూడు, పద్నాలుగవ రోజులు కూడుకుని, పదిహేనవ రోజున విశ్రమించి, ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 అయితే షూషనులో ఉన్న యూదులు పదమూడు, పద్నాలుగవ రోజులు కూడుకుని, పదిహేనవ రోజున విశ్రమించి, ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎస్తేరు 9:18
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్క రోజునే అంటే అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరిని, బాలలను, స్త్రీలను కూడా, హతం చేసి, సర్వనాశనం చెయ్యాలి.


అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన రాజాజ్ఞ, రాజశాసనం అమలు చేసే సమయం వచ్చింది. శత్రువులు యూదులను లొంగ దీసుకోవాలని ఆలోచించిన రోజున కథ అడ్డం తిరిగింది. తమను ద్వేషించిన వారిపై యూదులు తామే పట్టు బిగించారు.


ఆ రోజున షూషను కోటలో హతమైన వారి లెక్క రాజుకు చెప్పారు.


ఎస్తేరు “రాజైన మీకు సమ్మతమైతే ఈ రోజు జరిగినట్టే షూషనులో ఉన్న యూదులు రేపు కూడా చేయడానికి, హామాను పదిమంది కొడుకుల దేహాలను కొయ్యమీద వేలాడదీయడానికీ అనుమతి ప్రసాదించండి” అంది.


అదారు నెల పద్నాలుగో తేదీన షూషనులోని యూదులు సమకూడి పట్టణంలో మూడు వందల మంది పురుషులను చంపేశారు. అయితే వారు దోపుడు సొమ్ము పట్టుకోలేదు.


యూదులు అహష్వేరోషు పాలనలో ఉన్న సంస్థానాలన్నిటిలో ఉన్న పట్టణాల్లో తమకు కీడు తలపెట్టిన వారిని హతమార్చడానికి సమకూడారు. ఎవరూ వారి ముందు నిలవలేకపోయారు. అన్ని జాతుల ప్రజలకూ వారంటే భయం పట్టుకుంది.


యూదులు ప్రతి సంవత్సరం అదారు నెలలో పద్నాలుగు, పదిహేనవ తేదీల్లో పండగ చేసుకోవాలని నిర్ణయించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ