ఎస్తేరు 6:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 రాజు ఆ సంగతి విని–ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు–అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు. “మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు. అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు. అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
రాజు ఆత్రుతగా గారడీ విద్యలు చేసేవాళ్ళను, కల్దీయులను జ్యోతిష్యులను వెంటనే పిలిపించమని ఆజ్ఞ ఇచ్చాడు. బబులోనులోని జ్ఞానులు రాగానే వాళ్ళతో ఇలా అన్నాడు. “ఈ రాతను చదివి దీని భావం నాకు తెలియజేసిన వాడికి అతడు ఎవరైనా సరే, అతనికి ఊదా రంగు దుస్తులు ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేయిస్తాను. అతణ్ణి రాజ్యంలో మూడో అధిపతిగా నియమిస్తాను.”