Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎస్తేరు 5:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అప్పుడు అతని దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎస్తేరు 5:2
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.


యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.


ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు.


“పిలుపు రాకుండా పురుషుడు గానీ స్త్రీ గానీ రాజు గారి అంతఃపురం లోకి అడుగు పెడితే చట్ట ప్రకారం ఆ మనిషికి శిక్ష మరణమే. రాజు తన బంగారు రాజ దండాన్ని ఎవరివైపు చాపుతాడో ఆ వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. ఈ కఠినమైన ఆజ్ఞ రాజసేవకులందరికీ రాజ సంస్థానాల్లోని వారందరికీ తెలుసు. ముప్ఫై రోజులుగా రాజు సముఖానికి వెళ్ళడానికి నాకు పిలుపు రాలేదు.”


రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు.


యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.


రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.


అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి.


అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ