Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎస్తేరు 1:22 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాతప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 అహష్వేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును పంపాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ తన కుటుంబానికి యజమానిగా ప్రకటింపబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎస్తేరు 1:22
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ సలహా రాజుకీ అధికారులకీ నచ్చింది. కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు.


మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.


సీవాను అనే మూడో నెలలో ఇరవై మూడో రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దెకై ఆజ్ఞాపించినట్టు యూదులకు, ఇండియా నుండి ఇతియోపియా వరకూ విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషల్లో శాసనాలు రాశారు.


కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ, ఏ ప్రాంతంలో గానీ, ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను. వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు.”


లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక.


న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు.


ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ