Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 12:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. వీధి తలుపులు మూసేస్తారు. పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమునుచేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నీవు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వీధి తలుపులు మూసేస్తారు; తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు, పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వీధి తలుపులు మూసేస్తారు; తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు, పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 12:4
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి?


దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు?


తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి. కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు.


సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను.


కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ