Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 7:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 7:8
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు.


ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.


యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.


నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”


ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు.


నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు” అని చెప్పింది.


ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,


వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.


దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.


ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.


అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.


నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.


నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.


కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.


నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.


వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.


గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ‘ఇశ్రాయేలూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి, నిబంధనా నమ్మకత్వంతో నేను నిన్ను ఆకర్షించుకున్నాను.


కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను.


ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.


నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.


నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిశాలి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు. నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.


యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.


అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.


సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు.


ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”


అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.


మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.


నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.


యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు.


మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?


ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు.


‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.


దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.


యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ