ద్వితీ 12:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చటలేకుండ నశింపజేయవలెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టాలి, వారి అషేరా స్తంభాలను అగ్నితో కాల్చివేయాలి; వారి దేవతల ప్రతిమలను కూల్చివేసి, వాటి పేర్లు ఆ స్థలంలో లేకుండా నిర్మూలం చేయాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టాలి, వారి అషేరా స్తంభాలను అగ్నితో కాల్చివేయాలి; వారి దేవతల ప్రతిమలను కూల్చివేసి, వాటి పేర్లు ఆ స్థలంలో లేకుండా నిర్మూలం చేయాలి. အခန်းကိုကြည့်ပါ။ |
ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.