Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 7:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మొదటిది సింహం లాటిది. దానికి గరుడ పక్షి రెక్కలవంటి రెక్కలున్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసేశారు. అందువల్ల అది మనిషి లాగా కాళ్ళతో నేలపై నిలబడింది. మనిషి మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 7:4
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు.


మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.


యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. సెలా.


గుహలోనుంచి కొదమ సింహం వచ్చినట్టు ఆయన బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళ దేశం ఆయన కోపాగ్నికి నాశనమైపోతుంది.”


ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.


పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు.


యెహోవా ఇలా చెప్తున్నాడు. “తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు.


చూడండి, అతడు యొర్దాను అడవుల్లో నుండి ఎంతో కాలంగా ఉన్న పచ్చిక మైదానం లోకి వచ్చే సింహంలా వస్తున్నాడు. దాన్ని చూసి ఏదోము తక్షణమే పారిపోయేలా చేస్తాను. దానిపైన నేను ఎంపిక చేసిన వాణ్ణి అధిపతిగా నియమిస్తాను. ఎందుకంటే నాలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నన్ను రమ్మని ఆజ్ఞాపించగలిగేది ఎవరు? నన్ను నిరోధించే కాపరి ఎవరు?


మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.


నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.


నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు.


దేవుడు రాజ్యంలో ప్రతి ప్రాంతాన్నీ, భూమిపై ఉండే ప్రతి జంతువులను, ఆకాశంలో ఎగిరే సమస్త పక్షిజాతిని అన్నిటినీ మీ ఆధీనంలో ఉంచాడు. ప్రజలందరి మీదా మీకు సర్వాధికారం అనుగ్రహించాడు. దర్శనంలో కనిపించిన ఆ బంగారపు తల మీరే.


ఆ సమయంలో నాకు మళ్ళీ బుద్ది వచ్చింది. నా రాజ్యానికి గత వైభవం కలిగేలా ముందున్న ఘనత, ప్రభావాలు నాకు మళ్ళీ చేకూరాయి. నా మంత్రులు, నా క్రింది అధికారులు నా దగ్గరికి వచ్చి సమాలోచనలు జరిపారు. నా రాజ్యంపై అధికారం నాకు స్థిరపడింది. గతంలో కంటే అధికమైన ఘనత నాకు దక్కింది.


మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే దాకా అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయం, ఒక కాలం వాటికి ఏర్పాటు అయింది.


రెండవ జంతువు ఎలుగుబంటి లాటిది. అది ఒక పక్కకి తిరిగి పడుకుని తన నోట్లో పళ్ళ మధ్య మూడు ప్రక్కటెముకలను కరిచి పట్టుకుని ఉంది. కొందరు “లే, బాగా మాంసం తిను” అని దానితో చెప్పారు.


శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.


దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.


నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ