Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 12:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఆ కాలమందు నీ జనులపక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలమువరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 12:1
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.


జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు.


సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.


ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.


కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.


అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.’”


అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.


నేను, యెహోవాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.


నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.


పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.


అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”


కాబట్టి తన శిబిరం డేరాను సముద్రానికి, పరిశుద్ధానంద పర్వతానికి మధ్య వేస్తాడు. అయితే అతనికి నాశనం వచ్చినప్పుడు ఎవరూ అతనికి సహాయం చేయడానికి రారు.


అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.


యెరూషలేములో జరిగిన అరిష్టం మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు పాలకులుగా ఉన్న మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు.


అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.


అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు.


ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.


ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.


అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.


వారు తిరస్కారం పొందడం లోకాన్ని దేవునితో సమాధానపరచడం అయితే, వారిని స్వీకరించడం చనిపోయిన వారు సజీవులుగా లేచినట్టే అవుతుంది గదా?


“విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.


సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.


అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.


అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.


నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు.


అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు.


భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.


వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”


చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.


జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.


జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.


అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ