Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 11:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఇప్పుడు సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఇంకా ముగ్గురు రాజులు పారసీకంపై రాజ్యం చేసిన తరవాత అందరికంటే ఐశ్వర్యం కలిగిన నాలుగవ రాజొకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యానికి విరోధంగా రేపుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 “దానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరిస్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె ముందున్న ఇతర పారసీక రాజులకంటె, ఆ నాలుగవ రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 11:2
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.


పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు.


ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి.


నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?


పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.


అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని, దక్షిణదేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలం పుంజుకుని, ధైర్యం కూడగట్టుకుంటాడు. కాబట్టి దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మహా బలంతో యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. కానీ అతడు తనకు వ్యతిరేకంగా తలపెట్టిన పన్నాగాల మూలంగా నిలవ లేక పోతాడు.


రెండవ జంతువు ఎలుగుబంటి లాటిది. అది ఒక పక్కకి తిరిగి పడుకుని తన నోట్లో పళ్ళ మధ్య మూడు ప్రక్కటెముకలను కరిచి పట్టుకుని ఉంది. కొందరు “లే, బాగా మాంసం తిను” అని దానితో చెప్పారు.


బొచ్చు ఉన్న ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని రెండు కళ్ళ మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది.


ఆ దినాలను గూర్చిన దర్శనాన్ని గూర్చి చెప్పినది వాస్తవం, నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయవద్దు. ఎందుకంటే అది భవిషత్తులో నెరవేరుతుంది.”


ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమానికి, ఉత్తరానికి, దక్షిణానికి, పరుగులు పెడుతూ ఉండడం కనిపించింది. ఇలా జరుగుతుండగా దాన్ని ఎదిరించడానికైనా, దానికి చిక్కకుండా తప్పించుకోడానికైనా, ఏ జంతువుకూ శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టు చేస్తూ గొప్పదయింది.


తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.


లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,


అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ