దానియేలు 11:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఎందుకంటే ఉత్తర దేశంరాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మళ్ళీ వస్తాడు. ఆ కాలాంతంలో, అంటే కొన్ని సంవత్సరాలైన తరువాత అతడు గొప్ప సైన్యాన్ని విశేషమైన యుద్ధ పరికరాలను సమకూర్చి నిశ్చయంగా వస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చుకుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటె చాలా పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్ధానికి వెళతాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు. အခန်းကိုကြည့်ပါ။ |