Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 7:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 యెహోవా నాతో ఇలా అన్నాడు. “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” “మట్టపు గుండు” అన్నాను. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు. “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను. ఇక ఏమాత్రం నేను వాళ్ళను వదిలిపెట్టను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 యెహోవా–ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా– నా జనులగు ఇశ్రాయేలీయులమధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు. “ఒక మట్టపు గుండును” అని నేనన్నాను. అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులమధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తొలగిస్తాను).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 7:8
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను షోమ్రోనును కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.


నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి. మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.


గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు.


నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.


సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.


గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు. “దీనికి ‘లో రూహామా’ అని పేరు పెట్టు. ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను.


ఆయన నాకిది చూపించాడు. చూడు, మట్టపు గుండు చేతిలో పట్టుకుని ప్రభువు గోడ పక్కన నిలబడ్డాడు.


ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.


నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.


స్వల్పమైన పనులు జరిగే కాలాన్ని ఎవరు తృణీకరిస్తారు? లోకమంతా సంచారం చేసే యెహోవా ఏడు కళ్ళు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండునూలును చూసి సంతోషిస్తాయి.”


“నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి.


“నీకు ఏమి కనబడుతుంది?” అని అతడు నన్ను అడిగాడు. అందుకు నేను “20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఉండి ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం కనబడుతుంది” అని చెప్పాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ