Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 7:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 7:9
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.


యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.


నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.


నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.


దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.


దావీదు దినదినమూ వర్ధిల్లుతూ వచ్చాడు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.


దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.


ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ వచ్చాడు.


దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.


నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.


శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.


అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.


బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు


యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.


దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.


ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.


దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.


ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.


వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ