Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 23:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే; యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఇవి దావీదు చివరి మాటలు, “యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం. దావీదు ఇలా అన్నాడు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దావీదు చివరి మాటలు: “యెష్షయి కుమారుడైన దావీదు పలికిన దైవావేశ మాటలు, సర్వోన్నతునిచే హెచ్చింపబడినవాడును, యాకోబు దేవునిచే అభిషేకించబడినవాడును, ఇశ్రాయేలు కీర్తనల మధుర గాయకుడునైన దావీదు పలికిన మాటలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దావీదు చివరి మాటలు: “యెష్షయి కుమారుడైన దావీదు పలికిన దైవావేశ మాటలు, సర్వోన్నతునిచే హెచ్చింపబడినవాడును, యాకోబు దేవునిచే అభిషేకించబడినవాడును, ఇశ్రాయేలు కీర్తనల మధుర గాయకుడునైన దావీదు పలికిన మాటలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 23:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.


ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.


తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.


ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.


ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.


నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను.


యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.


నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.


నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.


తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.


“నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.


తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు.


దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు


క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.


మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.


దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు.


ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.


యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ