Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 21:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషె తును అప్పగింపక

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 21:7
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు రాజు “మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది” అని సీబాతో చెప్పినప్పుడు సీబా “నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు” అన్నాడు.


అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు రాజు “మెఫీబోషెతూ, నీవు నాతో కలసి ఎందుకు రాలేదు?” అని అడిగాడు.


సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.


“సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు.


కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.


సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “మెఫీబోషెతూ” అని అతణ్ణి పిలిచాడు. అతడు “అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు.


దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు.


నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.


యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.


అప్పుడు యోనాతాను “ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకొన్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను.


నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక.”


యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.


అప్పుడు యోనాతాను “యెహోవా నీకూ నాకూ, నీ సంతానానికీ నా సంతానానికీ మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడు గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాము కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు” అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్లిపోగా, యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు.


నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి” అని యోనాతానును కోరాడు.


వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.


తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ