8 అప్పుడు రాజు నగరద్వారం వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు. అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు.
8 కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు. ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.
8 కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు. ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.
పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని “నువ్వు ఏ ఊరివాడివి?” అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. “నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి” అని వాడు చెప్పినప్పుడు,
ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు.
అందుకు రాజు “మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను” అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
రాజు తన ముఖం కప్పుకుని “అబ్షాలోమా నా బిడ్డా, అబ్షాలోమా నా బిడ్డా” అంటూ కేకలువేస్తూ ఏడుస్తున్నాడని, అబ్షాలోమును గూర్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు.
కాబట్టి యెహోరాము తన సైన్యాన్నీ, రథాలన్నిటినీ తీసుకుని ఎదోము సరిహద్దుల్లో ఉన్న జాయీరు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎదోము సైన్యాలు వాళ్ళను చుట్టుముట్టాయి. కానీ యెహోరాము రాత్రివేళ తన సైనికులతో రథాలతో శత్రుసైన్యాల పంక్తులను ఛేదించుకుని తప్పించుకున్నారు. అప్పుడు అతని సైన్యం తప్పించుకుని తమ ఇళ్ళకు చేరుకున్నారు.
ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.