2 సమూయేలు 19:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ, నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు నీకు ఇష్టమైనవారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్షాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది. အခန်းကိုကြည့်ပါ။ |