Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:29 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 అప్పుడు రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అహిమయస్సు “నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు–యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగునన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరు గుట నేను చూచితినిగాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు. “యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:29
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

సాదోకు కొడుకు అహిమయస్సు “కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు. యోవాబు “కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా” అని అతనితో అన్నాడు.


అప్పుడు రాజు “నువ్వు అవతలికి వెళ్లి నిలబడు” అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు.


రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అప్పుడు కూషీవాడు “మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది” అన్నాడు.


అప్పుడు యోవాబు అమాశాను చూసి “నా సోదరా, క్షేమంగా ఉన్నావా?” అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు.


నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?’ అని అడుగు” అని చెప్పి పంపించాడు. దానికామె “క్షేమంగానే ఉన్నాం” అని జవాబిచ్చింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ