Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 16:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 16:23
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.


అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.


అహీతోపెలు అబ్షాలోముతో ఇలా చెప్పాడు “దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు.


అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.


అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.


యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.


వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.


యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.


నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.


పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది.


నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.


జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?


యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి” అన్నాడు.


ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.


న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు.


తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.


ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.


“నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ