2 సమూయేలు 14:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను–గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |