Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 11:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 11:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోవాబు అమ్మోనీయుల పట్టాణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు.


ఆ పట్టణం వారు బయటికీ వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.


నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.


అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు.


నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.


నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.


చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.


హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?


యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.


సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.


“ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.


ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ