Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 10:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అమ్మోనీయులు, దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి, తమ మనుషులను పంపి, బేత్రెహోబులో, అరాము సోబాలో ఉన్న అరామీయ సైన్యంలో నుండి ఇరవై వేలమంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మయకా రాజు దగ్గరనుండి వెయ్యిమంది సైనికులను, టోబులో నుండి పన్నెండు వేలమంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 –దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేలమంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, బేత్-రెహోబు నుండి సోబా నుండి 20,000 మంది అరామీయుల కాల్బలాన్ని, అలాగే మయకా రాజును, అతని నుండి 1,000 మంది సైనికులను, టోబు నుండి 12,000 మంది సైనికులను కిరాయికి తీసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, బేత్-రెహోబు నుండి సోబా నుండి 20,000 మంది అరామీయుల కాల్బలాన్ని, అలాగే మయకా రాజును, అతని నుండి 1,000 మంది సైనికులను, టోబు నుండి 12,000 మంది సైనికులను కిరాయికి తీసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 10:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి “మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం” అన్నాడు.


ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు, వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి “మీ గడ్డాలు పెరిగే వరకూ యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి” అని వారికి చెప్పమన్నాడు.


ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు.


అప్పుడు అహీతోపెలు “నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు శయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకొంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది” అన్నాడు.


మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,


రెహోబు కొడుకు హదదెజెరు అనే సోబా రాజు దగ్గర దోచుకొన్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు.


సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి


దమస్కులో ఉన్న అరామీయులు సోబా రాజైన హదదెజెరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.


దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు.


ఎందుకంటే ఆ శిబిరంలో ఉన్న వారు గుర్రాలూ, రథాలూ పరిగెడుతున్నట్టూ మరో పెద్ద సైనిక దండు కదులుతున్నట్టూ శబ్దాలు వినేలా యెహోవా చేశాడు. దాంతో వారు “మనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునీ, ఐగుప్తీయుల రాజునీ తోడు తెచ్చుకున్నాడు” అని తమలో తాము చెప్పుకున్నారు.


చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.


వాళ్ళు “యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి, మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు” అన్నారు.


అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా.


కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.


వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు. వాళ్ళు కలసి ఉండరు. వాళ్ళు నాశనమయే రోజు వాళ్లకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. అది వాళ్ళని శిక్షించే రోజు.


మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.


యెఫ్తా తన సహోదరుల దగ్గర నుంచి పారిపోయి టోబు దేశంలో నివాసం ఉన్నప్పుడు అల్లరిమూకలు యెఫ్తా దగ్గరికి వచ్చి అతనితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు.


అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు


ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండటం వల్లా, వాళ్లకు ఎవరితోనూ సంబంధం లేకపోవడం వల్లా వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు.


సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు.


ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ