2 రాజులు 7:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మనం ఊళ్ళోకి వెళ్తే కరువు వల్ల చచ్చిపోతాం. ఇక్కడ ఇలానే కూర్చుని ఉన్నా చావు తప్పదు. అందుకని లేవండి. సిరియా సైన్యం దగ్గరికి వెళ్దాం పదండి. వారు మనలను బతకనిస్తే ఉందాం, చంపితే చద్దాం” అని తమలో తాము చెప్పుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనులదండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బ్రతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరణిద్దాము.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
మనష్షేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుమీద యుద్ధం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని, వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిష్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి, వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి, ఫిలిష్తీయుల అధికారులు దావీదును పంపివేశారు.