2 రాజులు 7:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అన్నాడు. దానికి ఎలీషా “చూస్తూ ఉండు. అలా జరగడం నీవు కళ్ళారా చూస్తావు గానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు– నీవు కన్నులార దానిని చూచెదవుగాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 తర్వాత రాజుకు దగ్గరగా వున్న అధికారి దేవుని వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పకలోకపు కిటికీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు” అని ఆ అధికారి చెప్పాడు. “నీవు నీ కళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఒక్క విషయంలో యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి. అదేమిటంటే మా రాజుగారు రిమ్మోను దేవుణ్ణి పూజించడం కోసం మందిరంలో ప్రవేశించినప్పుడు నా చేతి మీద ఆనుకుంటాడు, అప్పుడు ఆయనతో పాటు నేను కూడా రిమ్మోను దేవుడి ఎదుట వంగుతాను. అలా నేను రిమ్మోను దేవుడి ఎదుట వంగినప్పుడు యెహోవా నీ సేవకుడినైన నన్ను క్షమిస్తాడు గాక” అన్నాడు.