Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 26:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్ర బోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగవేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, ప్రక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 26:7
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి.


దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకు యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులుతీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకొంటున్నారు.


అప్పుడు దావీదు “శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలసి ఎవరు వస్తారు” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కొడుకు, యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.


అప్పుడు అబీషై దావీదును చూసి “దేవుడు ఈ రోజున నీ శత్రువుని నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఆ ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను. ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ