Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 24:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’ అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి–ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 24:10
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.


నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.


యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు.


నాతో శాంతిసమాధానాలతో ఉన్నవాళ్ళ పట్ల నేను ఏ తప్పూ చెయ్యలేదు. విచక్షణ లేకుండా నా విరోధులకు నేను ఏ హానీ చెయ్యలేదు.


అయితే ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను.


దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు.


నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.


దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.


సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ