Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 20:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి” అని యోనాతానును కోరాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 20:8
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయనూ నమ్మకాన్నీ చూపించ దల్చుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను” అన్నాడు.


ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి “నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు.


అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.


దావీదు బయల్దేరి వాళ్లకు ఎదురు వెళ్లి వాళ్లతో “మీరు సమాధానంతో నాకు సాయం చెయ్యడానికి నా దగ్గరికి వచ్చి ఉంటే, నా హృదయం మీతో కలుస్తుంది. అలా కాకుండా నావల్ల మీకు అపకారమేమీ కలుగలేదని తెలిసినా, నన్ను శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే, మన పూర్వీకుల దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించు గాక” అన్నాడు.


నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.


అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.


నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నా మీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి ఎవరూ అప్పగించడానికి వీలు లేదు. నేను సీజరు ముందే చెప్పుకొంటాను” అన్నాడు.


అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు.


“యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు.


అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక.


దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.


యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.


ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. “ఈ విధంగా యెహోవా దావీదు శత్రువులు లెక్క అప్పగించేలా చేస్తాడు గాక” అని అతడు అన్నాడు.


యోనాతాను “అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా” అన్నాడు.


వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ