Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 20:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అప్పుడు దావీదు “రేపు అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కలసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకూ పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అందుకు దావీదు–రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 20:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

దానికి ఆమె భర్త “ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా” అన్నాడు. దానికామె “నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది” అంది.


నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.


అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.


బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.


వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.


మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”


ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో


అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.


వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.


కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి.


అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో.


యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు. “రేపు అమావాస్య. నువ్వుండే స్థలం ఖాళీగా కనబడుతుంది గదా నీవు లేని విషయం తెలిసిపోతుంది.


నువ్వు మూడు రోజులు ఆగి, ఈ పని జరుగుతుండగా నువ్వు దాక్కొన్న స్థలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు.


అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్యనాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు


అయితే అమావాస్య తరువాతి రోజు, అంటే రెండవ రోజు దావీదు కూర్చునే స్థలం లో ఎవరూ లేకపోవడం చూసి సౌలు “నిన్న, నేడు యెష్షయి కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏంటి?” అని యోనాతానును అడిగితే,


యోనాతాను “నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తాను” అన్నాడు.


నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, ‘దావీదు ఇంటివారు ప్రతి ఏడూ బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బేత్లెహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు.’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ