Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 20:30 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి “వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా, నీకూ నీ తల్లికీ అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకొన్న సంగతి నాకు తెలియదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి – ఆ గడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 20:30
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.


వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.


జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.


రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.


పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.


అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.


ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.


రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.


అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.


సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.


తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.


దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు” అని సౌలుతో చెప్పాడు.


యెష్షయి కొడుకు భూమిమీద బతికి ఉన్నంత కాలం నువ్వైనా, నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసు గదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతణ్ణి నా దగ్గరికి రప్పించు. నిజంగా అతడు చనిపోవలసిందే” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ