Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 11:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 11:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదావారు రాజును ఎదుర్కొవడానికి, నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు.


తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.


ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.


తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు,


అప్పుడు సమూయేలు “యెహోవా ఏర్పరచుకున్నవాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు” అని చెప్పినప్పుడు, ఆ ప్రజలంతా ఆనందంతో “రాజు చిరకాలం జీవిస్తాడు గాక” అంటూ బిగ్గరగా కేకలు వేశారు.


నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరకి వచ్చి నువ్వు ఏమి చేయాలో చెప్పేవరకూ ఏడు రోజులపాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి.”


అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. “వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను.


ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.”


ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ