Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 10:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 “తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 “తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 10:3
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.


అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.


దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.


మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.


ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.


అప్పుడు, యెహోవా ప్రకటించినట్టే, మా బాబాయి కొడుకు హనమేలు చెరసాల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నాతో ఇలా అన్నాడు. “బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని నీ కోసం కొనుక్కో. ఎందుకంటే దాని మీద వారసత్వపు హక్కు నీదే.” అప్పుడు ఇది యెహోవా వాక్కు అని నాకు తెలిసింది.


గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.


దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం.


అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి.


ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి.


వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించడానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్ధంతో చేసిన రొట్టెను అర్పించాలి.


శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.


చేరి యొర్దాను దగ్గర అంతమయింది.


ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు “యూదా వాళ్ళు వెళ్ళాలి” అని చెప్పాడు.


రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.


ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.


అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను


ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.


గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు.


వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ