Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 10:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి, మిమ్మల్ని బాధపెట్టిన ప్రజలనుండి విడిపించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తుదేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములోనుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములోనుండియు విడిపించితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 10:18
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాళ్ళ మధ్య నివసించడానికి తమను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ దేవుడైన యెహోవాను నేనే.”


మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.


యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు “నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను.


యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ