Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 9:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 9:1
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.


ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.


అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్ళను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకు వెళ్ళాడు.


ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.


ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.


కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.


నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.


ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.


ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు.


ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.


వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.


శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,


దక్షిణదేశ పట్టణాలు మూతబడి ఉన్నాయి. వాటిని తెరిచేవాడు ఉండడు. యూదా ప్రజలంతా చెరలోకి వెళ్ళిపోయారు.


అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.


యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు ఆ వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ