1 దిన 5:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపెట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు.