Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 28:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 “అయినా, ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నన్ను, నా కుటుంబమంతటి నుండి ఎన్నుకున్నారు. ఆయన యూదా గోత్రాన్ని, యూదా గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకుని, నా తండ్రి కుమారులలో నుండి నన్ను ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 “అయినా, ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నన్ను, నా కుటుంబమంతటి నుండి ఎన్నుకున్నారు. ఆయన యూదా గోత్రాన్ని, యూదా గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకుని, నా తండ్రి కుమారులలో నుండి నన్ను ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 28:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.


యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.”


ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.”


యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక.


మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు.


గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం.


గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం.


విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.


గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి జీఫు నివాసులు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా కొండలో దాక్కున్నాడని తెలియజేశారు.


ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.


ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు.


శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ