Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 25:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెదూతూను సంబంధుల్లో స్తుతిపాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతికింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అనే ఆరుగురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా షిమీ హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 యెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరుగురు. యెదూతూను తన కుమారులకు నాయకత్వం వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితార వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ స్తుతి పాటలు పాడేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 25:3
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.


ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.


ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.


పదునాలుగోది మత్తిత్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.


హేమాను సంబంధుల్లో హేమాను కొడుకులు బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తియెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనేవాళ్ళు.


ఇంకా ఓబద్యా ఉన్నాడు. ఈ ఓబద్యా షెమయా కొడుకు. షెమయా గాలాలు కొడుకు. గాలాలు యెదూతోను కొడుకు. నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు.


హేమాను సంతానంలో యెహీయేలు, షిమీ, యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేలు.


యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.


సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు.


ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ