1 దిన 24:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతా మారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు. အခန်းကိုကြည့်ပါ။ |
లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.